సినీ ప్రపంచానికి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా మా మనస్పూర్తి శుభాకాంక్షలతో కూడిన ఆహ్వానము
100 కి 90 % సినిమా పై ఆసక్తి ఉన్నవారే, అది చూడటానికి అవ్వొచ్చు, విశ్లేషణ చెయ్యటానికి అవ్వొచ్చు, సినిమాలో పనిచెయ్యటానికి అవ్వొచ్చు. 90 % లో మెజారిటీ చర్చించడం, అభిమానించడం, సినిమా వాళ్ళ గురించి ఆలోచించడాన్ని రోజు సమాజంలో జనాలు వాళ్ళ వాళ్ళ జీవితాల్లో చూస్తుంటారు.
అందుకే సినిమా ప్రపంచానికి అంతటి ఆకర్షణ శక్తీ ఉంది, అంతటి శక్తికి ఎందరినో దానివైపు లాగేయడంలో తప్పు లేదు.
కానీ ఆకర్షించబడ్డ ప్రతివారు ఇక్కడికి రారు. వారి వారి పరిధులలో ఆలోచించో , కుటుంభ నేపద్యమో, లైఫ్ & జాబ్ సెక్యూరిటీ దృష్టితోనో , దారులు తెలియక , వారిపై వారికి నమ్మకం లేక, వారి టాలెంట్ ఇక్కడ సరిపడదు అని గ్రహించో…. ఇలా కొంతమంది వెనుదిరుగుతారు.
మరికొంతమంది నిజంగా టాలెంట్ ఉన్నవారు ధైర్యం ఉన్నవారు, అలాగే డబ్బులున్నవారు, తెలియక వారిని వారు ఎక్కువగా ఊహించుకునే వారు , నలుగురి పొగడ్తల్ని నిజమే అనుకుని వచ్చేవారు, సెలబ్రిటీ అవ్వాలనుకునేవారు ఇలా ఎంతో మంది ఆ ప్రపంచ తలుపుల్ని కొడుతూనే ఉంటారు, కాని అవి అందరికి తెరుచుకోవు.
ఇక్కడి నగ్న సత్యాలు తెలుసుకుని రావడాన్నే మేము స్వాగాతిస్తాము.
గమనిక : ఇది ఒక ఊభి ఒక్కసారి దిగితే భయటకు రావటం ఉండదు, ఒకవేళ రావాలనుకున్నా వచ్చినా మళ్ళి ఇక్కడి వారు అందులోకి తోసేస్తారు.
కళకు సంకెళ్ళు వేసి నిబందనలు చేసేవాళ్ళో పక్క, కళని లాకర్ లో పెట్టి నిర్భందించుకో మనే వాళ్ళో పక్క ఉన్న సమాజంలో కళనే ఆధారంగా ఉండే ప్రపంచంలో నిలదొక్కుకోవటం కష్టమే కాదు నరకం.
ఆ నరకాన్ని కూడా తెలిసో తెలీకో చాలామంది అనుభవిస్తున్నారు. దయచేసి ఈ ప్రపంచానికి రావాలనుకున్న వారు ముందుగా మా ఈ వెబ్ సైట్ ని కొన్ని రోజులు ఫాలో అయ్యి, అన్ని ఆలోచించుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి.
16 నుండి 25 సం|| ఉన్న వయసువాళ్ళు దయచేసి ఆవేశపూరిత మరియు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకండి.
Leave a Reply