ఇక్కడికి రావాలని చాలా మంది కలలు కంటారు .. కాని వచ్చే ముందు ఆలోచించి రండి !!!
కచ్చితంగా స్పృహతో ఆలోచించండి లక్షల, కోట్ల ఉద్యోగాలు చదువు, శ్రమ ప్రాతపదికన సరైన విధి విధానాలతో, మార్గాలతో ఎన్నో ఉంటేనే పోటీ ప్రపంచంలో ఎందరో ఉద్యోగాలు రాక అల్లాడుతున్నారు.
అలాంటిది మార్గం విధి విధానాలు లేని ఉండని, కేవలం కళ దానిలో మీకున్న టాలెంట్ ని మాత్రమే కొలమానంగా చూస్తూ, అందులోనూ విజయం ఉన్న వారికి మాత్రమే అవకాశాలు ఇచ్చే ప్రపంచంలోకి రావాలంటే దానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో ఆలోచించండి , పునరాలోచించండి మళ్ళి మళ్ళి పునరాలోచించండి.
మన సమాజం మనల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది అది స్నేహితులగానో, బండువులగానో , చుట్టూ ఉండే వాళ్ళలానో, తెలిసిన వాళ్ళలానో వాళ్ళ కళ్ళు మనమీద ఎప్పుడూ ఉంటాయి. ఆకాశంలో తారల సమూహంలో ఏ తార రాలుతుందో తెలియదు అలాగే ఎవరు ఎప్పుడు ఎక్కడ మన పై మాటల దాడి చేస్తారో తెలియదు. అన్నిటికి సిద్ధపడటం చాలా ముఖ్యం.
ఇక్కడ అడుగుపెట్టాలనుకున్న రోజు ఉన్న ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యం ఇక్కడివాళ్ళు నిన్ను ఛీకొట్టిన నీ ఆశలు అడిఆశలుగా ఉన్నా నాడు కూడా అంతే ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధ్వర్యం ఉంటేనే ఈ ప్రపంచంలో బ్రతగగలవు.
భూ ప్రపంచం లో బ్రతకడానికి ఆక్సీజన్ ఎంత అవసరమో ఈ ప్రపంచంలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధైర్యం, మనోధైర్యంతో కూడిన టాలెంట్ ఉండాలి లేకపోతే ఈ ప్రపంచంలో ఊపిరాడటం కష్టం.
Leave a Reply