ముందుమాటలు – ముమ్మాటలు
–> సినిమా చూసేవాళ్ళకే ఆనందం కాని సినిమా చేసే వాళ్ళకి కాదు.
–> సినిమా ప్రపంచాన్ని ఇష్టపడే ప్రతివాడు ఇక్కడికి రాలేడు, వచ్చిన ప్రతివాడు నిలదొక్కుకోలేడు.
–> ఇక్కడ రమ్మని ఎవ్వరు ఎవర్ని పిలవరు, ఎవర్ని పోమ్మనరు – ఎవరి బ్రతుకు వాడు బ్రతకాల్సిందే
–> సక్సెస్ నే కొలమానంగా చూసే ప్రపంచం ఇది, అది లేని రోజు నిన్ను పలకరించే నాదుడుండడు
–> ఇక్కడకి వచ్చినవాళ్లు ఆకాశమంత అందలం ఎక్కిన వారున్నారు, ఆనవాళ్ళు లేక అనాధ చావులు చచ్చినవాళ్ళున్నారు
–> ఇక్కడ టాలెంట్ తో పాటు కొంచం అదృష్టం కూడా ఉండాలి
అందరూ పిలుస్తున్నట్టు ఫిలిం ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ ఒక పరిశ్రమ కాదు ఇది ఒక ప్రపంచం పైకికనిపించే రంగు రంగుల కలల ప్రంపంచం కాని లోపల.. ఎన్నో కస్టాలు, కన్నీళ్ళు, కడుపు మంటలు, కుట్రలు కుతంత్రాలు అన్నిటికి మించి నచ్చిన మెచ్చిన సినిమా తీసాం తీయబోతున్నాం అన్న సంతృప్తి… ఇంకా ఎన్నో భావోద్వేగాలు కలిగున్నదీ మాయా ప్రపంచం అయినా ఇదే మాకు హాయి ప్రపంచం.
సమాజంలో సినిమా పట్ల సినిమా కళ పట్ల చాల మంది ఆకర్షితులు అవుతారు, అందులో ఎక్కువశాతం దానిని వాళ్ళ జీవిత గమ్యంగా పెట్టుకుని, మార్చుకుని పోరాడుతుంటారు. అయితే అందులో తెలిసి తెలియక మోజులో ఉండే వాళ్ళే అధికం.
ఎందుకంటే ఈ సినిమా ప్రపంచాన్ని జనం ఆదరించటం. ఆ ఆదరణా, గుర్తింపు చాల దగ్గిరగా జనాల్లో ఉంటూనే చూడటం మూలాన అనుకుంట.
ఎలా ? – ఇదిగో ఇలా : ఇంట్లో నలుగురు కలిస్తే సినిమా – ఆహ్లాదం కోసం, నలుగురు స్నేహితులు కలిస్తే సినిమా – ఆనందం కోసం, బోర్కొట్టినా సినిమా, కాలక్షేపానికి సినిమా, నలుగురు కలిసి ముచట్లు పెడితే అందులో సినిమా గురించి రాక మానదు. పైగా సినిమా హీరోలని ఆరాధించే గుణం ఎలాగు మనవాళ్ళకి ఉండనే ఉంది అలాంటి వాళ్ళు రోజికి ఓసారాన్న తారసపడటం…
ఇవన్నీ కలిసి సినిమా కళ పై, సినిమా కళ మనపై ఎంత ప్రభావితం అవుతామో అవుతుందో అర్ధమవుతుంది.
మీరు సినిమా ప్రపంచం పై ఆకర్షితులయ్యారా ..?? అదే సినిమా పిచ్చోళ్ళలో మీరు ఒకరా ? అయితే మిగతాది చదవండి లేకపోతే హాయిగా సినిమాలు చూసుకోండి !!!
- సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాని ఎక్కువగా ఆకర్షితులయ్యేది 15 క్రాఫ్ట్స్ కి మాత్రమే. అందులో మీరు దేన్నీ ఎంచుకుంటారో నిర్ణయించుకోండి కేవలం ఒకటి మాత్రమే.
- అందులో మీకున్న విషయ పరిజ్ఞానాన్ని పరిక్షించుకోండి (షార్ట్ ఫిలిమ్స్ లేదా వెబ్ కంటెంట్ తో …)
- ఇది ఇంతే కదా అన్న భ్రమలో ఉండకండి, చేసేయొచ్చు కాదు చేసిచూపించు.
- తెలియనివి తెలుసుకోండి, తెలిసినవి మెరుగుపరుచుకొండి.
- కష్టాలు ఎదుర్కునే ధర్యం ఉందొ లేదో తేల్చుకోండి.
- చుట్టూ ఉన్న అవగాహన రాహిత్యమైన వాళ్ళ పొగడ్తలను అవగాహనతో గుర్తించి తిరస్కరించుకోవాలి.
- విషయం ఎక్కడున్నా వెతికి వదలక నేర్చుకోవాలి. అంతేకాని ఫోన్ లో FB లో వాట్స్ యప్ లో హింసించటం కాదు.
- ప్రపంచానికి మీకున్న టాలెంట్ ని చూపించగలగాలి (ఎలా ?) ఇప్పుడున్న టెక్నికల్ యుగం లో పెద్ద కష్టమేమి కాదు తెలివుంటే.
- ఇక్కడ అవకాసం ఎవరూ ఇవ్వరు వాటిని మనమే కల్పించుకోవాలి.
- చుట్టూ ఉన్నవారు చుట్టాలన్నవారు ఎంత హీనంగా చూసినా నిసిగ్గుగా ఉండాలి.
- సహనం, ఓర్పు, స్వార్ధం, సమయస్పూర్తి కచ్చితంగా ఉండాలి.
- అన్నిటికంటే ముఖ్యం ఆర్ధికంగా సపోర్ట్ ఉందొ లేదో చూస్కోండి , లేకపోతే సేఫ్ ప్లే (అనగా జాబు లేదా బిజినెస్) బ్రతుకుతెరువుకోసం చేస్తూ అయిన ఉండాలి.
ఇవన్ని ఓకే అనుకుంటేనే మీకు మా ఈ సినిమా ప్రపంచానికి
స్వాగతం సుస్వాగతం….!!!!!
Leave a Reply